నయనతార నటిస్తున్న లేటెస్ట్ సినిమా టెస్ట్. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. శశికాంత్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టెస్ట్ మూవీ మోషన్ పోస్టర్‌ని మేకర్స్ రివీల్ చేశారు. షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉందని అనౌన్స్ చేశారు. మోషన్ పోస్టర్‌ని బట్టి టెస్ట్ మూవీ స్పోర్ట్స్ డ్రామా అని కన్‌ఫర్మ్ చేసినట్టు అయింది. క్రికెట్ స్టేడియంలో ఒకరు బాల్ వేయగా, మిగిలిన వాళ్లు విజిల్స్ వేయడం, ఛీర్స్ కొట్టడం వినిపిస్తోంది మోషన్ పోస్టర్‌లో. ఇప్పటికే ఈ స్టోరీ లైన్ మీద ఆడియన్స్ లో బజ్ ఏర్పడింది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో నయనతారతో పాటు రాశీఖన్నా కూడా కీ రోల్ చేయనున్నట్టు టాక్. చక్రవర్తి రామంద్రన్, శశికాంత్ సంయుక్తంగా ఈ సినిమాను వై నాట్ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. దక్షిణాదిన టాలెంటెడ్ నిర్మాతలుగా పేరుంది వీరికి.
ఆయుత్త ఎళుత్తు, రంగ్ దే బసంతిలో ఇంతకు మునుపే కలిసి పనిచేశారు మాధవన్, సిద్ధార్థ్. మణిరత్నం కాంపౌండ్ హీరోలుగా ఇద్దరికీ ఇంతకు ముందే మంచి పరిచయం ఉంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. సిద్ధార్థ్‌తో ఇంతకు ముందు ఎప్పుడూ నయనతార కలిసి పనిచేయలేదు. కానీ రాశీఖన్నాతో పనిచేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది నయన్‌కి. టెస్ట్ షూటింగ్‌లో పాల్గొంటూనే నయనతార 75కి కూడా కాల్షీట్ కేటాయించారు లేడీ సూపర్‌స్టార్. మరోవైపు జవాన్ కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆర్.మాధవన్ ఇప్పుడు జి.డి.నాయుడు బయోపిక్‌తో బిజీగా ఉన్నారు. మీడియాఒన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సిద్ధార్థ్ ఇప్పుడు ఇండియన్2 ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.